Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రధానిమోడీ దాసోహంతోనే దాడులు ధరల పెరుగుదల: సిపిఐ

ప్రధానిమోడీ దాసోహంతోనే దాడులు ధరల పెరుగుదల: సిపిఐ

ప్రధానిమోడీ దాసోహంతోనే దాడులు ధరల పెరుగుదల: సిపిఐ

న్యూస్ తెలుగు/పానగల్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాసోహంతోనే ఇరాన్ పై భీకర దాడులు, ప్రాణనష్టం, గ్యాస్ ధరల పెరుగుదలకు కారణమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ, ఉప సర్పంచ్ కృష్ణవేణి విమర్శించారు. పానగల్ అంబేద్కర్ చౌక్ లో ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ధరల పెరుగుదల, నరేంద్ర మోడీ వైఫల్యంపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రష్యాతో చమురు తక్కువ ధరకు కొనేఅవకాశమున్నా, నరేంద్ర మోడీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసందాన్ని వదులుకున్నారన్నారు. అమెరికా ఇజ్రాయిల్ పొరుగు దేశాల చమురు నిక్షేపాలపై కన్నేసి ఆక్రమించేందుకే భీకర దాడులు చేస్తున్నాయని, ఇప్పటికే 1900 మందిప్రాణాలు కోల్పోగా 20వేల మంది గాయపడ్డారన్నారు. ఈ దుచ్చెర్య పై నరేంద్ర మోడీ పన్నెత్తి మాట్లాడకుండా పరోక్ష మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. యుద్ధం పేరుతో దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 60, వాణిజ్య సిలిండర్ ధర రూ. 115 కు పెంచారని,ఆ ధరలకు కూడా గ్యాస్ దొరకక వ్యాపారాలు మూతపడుతున్నాయన్నారు. యుద్ధం పై నరేంద్ర మోడీ మౌనాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్, పానగల్ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, మాజీ కార్యదర్శి కాకం బాలస్వామి, వార్డు సభ్యులు కురుమమ్మ, లక్ష్మీ, సహదేవుడు నేతలు చిన్న కుర్మయ్య,చెన్నమ్మ, మల్లెపు బాలస్వామి, సాయి లీల తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రధానిమోడీ దాసోహంతోనే దాడులు ధరల పెరుగుదల: సిపిఐ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!