బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర వితరణ కార్యక్రమం..
న్యూస్ తెలుగు/వినుకొండ : బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 105వ నిత్యావసర వితరణ కార్యక్రమం స్థానిక విద్యానగర్ లోని రఘు మాస్టారు ఇంటివద్ద జరిగింది. ఈ నెలలో చింతలపూడి భద్రయ్య , చింతల చెరువు రఘు , పుట్టం రాజు, నారాయణ రావు ల సహాయసహకారాలతో 4 పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువుల వితరణ నిర్వహించారు. ఈ సందర్బంగా జి. వి.మాధవరావు మాట్లాడుతూ. గత 37 సంవత్సరాలు నుండి బ్రాహ్మణ సేవాసమితి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పెద్దలు పాల్గొన్నారు.(Story : బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర వితరణ కార్యక్రమం.. )

