26 వసంతాలు పూర్తి చేసుకున్న వెన్నెల నేత్రాలయం..
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణంలోని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు మరియు పురపాలక సంఘ చైర్మన్ షేక్. దస్తగిరి షకీలా దంపతులను బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బెజవాడ వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక బాలికోన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీ.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ. నామ మాత్రపు ఫీజులతో పేదల సేవలో వెన్నెల నేత్రాలయం 26 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని సత్కరించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందన్నారు. పురపాలక సంఘంలోని ప్రజలకు మున్సిపల్ చైర్మన్ గా మరియు వార్డు కౌన్సిలర్ గా నిత్యం అందుబాటులో ఉంటూ పుర ప్రజలకు సేవలందిస్తున్న దస్తగిరి దంపతులు అభినందనీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగ పద్మ తో పాటు జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.(Story : 26 వసంతాలు పూర్తి చేసుకున్న వెన్నెల నేత్రాలయం.. )

