Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బొల్లాపై జడ్పీ కో ఆప్షన్ సభ్యులు స్వెనోమ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన

బొల్లాపై జడ్పీ కో ఆప్షన్ సభ్యులు స్వెనోమ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన

బొల్లాపై జడ్పీ కో ఆప్షన్ సభ్యులు స్వెనోమ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పై జడ్పీ కో–ఆప్షన్ సభ్యులు గుండాల స్వెనోమ్ చేసిన నిరాధార ఆరోపణలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భేతం గాబ్రియేలు, కౌన్సిలర్ జయరాజు, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు దేవదాసుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొని స్వేనోమ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఒక సామాన్య పత్రికా విలేకరిగా ఉన్న వ్యక్తికి జడ్పీ కో–ఆప్షన్ సభ్యునిగా అవకాశం కల్పించినప్పటికీ, అదే పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం దారుణమని విమర్శించారు. ఎన్ఎస్పీ కాలనీలోని 23 ఎకరాల భూమిని ప్రభుత్వం ద్వారా స్వాధీనం చేసుకొని మున్సిపాలిటీకి అప్పగించిన ఘనత మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దేనని గుర్తు చేశారు. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కలిగిన ఏకైక మున్సిపాలిటీగా వినుకొండ రికార్డుల్లోకి వెళ్లిందన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఎన్ఎస్పీ కాలనీ భవనాలు శిథిలావస్థకు చేరడంతో, ప్రభుత్వమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, నివాసానికి అనర్హమని నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇళ్లను బలవంతంగా తొలగించారనడం అబద్ధమని ప్రశ్నించారు. నిజంగా దళితుల పక్షాన నిలబడాలంటే, టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని సూచించారు. జగన్ పేరు చెప్పుకుంటూ, సొంత పార్టీ నాయకులపై అసత్యాలు ప్రచారం చేయడం మంచి రాజకీయ సంస్కృతి కాదన్నారు. ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో మీరు జోక్యం చేసుకున్న తరువాతే మూడు వర్గాలుగా చీలిపోయిందని, చర్చికి సంబంధించిన 33 లక్షల రూపాయల నగదు బాండ్లు మీ వద్దనే ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకనే ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాస్టర్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఉండి, తెలుగు బాప్టిస్ట్ చర్చి రాజకీయాల్లో జోక్యం చేసుకొని, వందేళ్ల చరిత్ర ఉన్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కుతూ కమిటీ ఎన్నికలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కి నమ్మిన బంటుగా ఉంటూనే, విపక్షంలా వ్యవహరిస్తూ దళితులపై చాడీలు చెప్పడం, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా విధానం మార్చుకొని దళితుల సమస్యలపై నిజాయితీగా పోరాటం చేస్తే తామూ మద్దతిస్తామని స్పష్టం చేశారు. మీ వద్ద ఉన్న 30 లక్షల రూపాయల చర్చి బాండ్లను కమిటీకి ఎప్పుడు అప్పగిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆస్తుల పరిరక్షణ కోసం బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇలాంటి దళిత వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్న నాయకులకు మా సూచన గుండాల స్వేనోమ్ వ్యక్తికి ఎంత ఆదరించినా, వెన్నుపోటు పొడవడం ఆయన సహజ లక్షణం అన్నది గుర్తించాలి. గత అనుభవాలే దీనికి నిదర్శనం. ఇలాంటి దళిత వ్యతిరేక వ్యక్తులను ఇంకా కొనసాగిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటే, ఆ ప్రభావం తప్పకుండ మీపై పడుతుంది. ఫలితంగా మీరు దళిత సమాజం నుంచి వ్యతిరేకతకు, అసహనానికి గురికావాల్సి వస్తుందన్నారు.(Story : బొల్లాపై జడ్పీ కో ఆప్షన్ సభ్యులు స్వెనోమ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!