పలు ఆలయాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు
న్యూస్ తెలుగు /సాలూరు :
ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సాలూరు పట్టణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గోవింద నామ స్వరంతో మారుమోగాయి. మంగళవారం ఉదయం 4:00 నుండి పట్టణ పరిధిలో ఉన్న కొంకి వీధి లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస కాలనీలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, పెద్ద కోమటి పేటలో ఉన్న శ్రీ సీతారామాలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. ఈ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.ఈ ఏకాదశి పర్వదినాన సాలూరు పట్టణంలోనున్న శ్రీ శ్రీ భూ నీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పలికి దుస్సాలువాతో సత్కరించి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆర్.పి బంజే దేవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ చిన్నారులు వేస్తున్న కోలాటాన్ని వీక్షించారు.సందర్భంగా ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు భక్తులకు దగ్గరుండి దర్శనాలు కల్పించారు. (Story: పలు ఆలయాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు)

