Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ లో ఘనంగా పెన్షనర్స్ దినోత్సవం

బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ లో ఘనంగా పెన్షనర్స్ దినోత్సవం

బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ లో ఘనంగా పెన్షనర్స్ దినోత్సవం

న్యూస్‌తెలుగు/ అనంతపురం టౌన్ : స్థానిక సోమనాథ్ నగర్ లోని బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ సమావేశమై పెన్షనర్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ… డి. స్.నాకరా సుప్రీంకోర్టు 1982లో పెన్షనర్స్ తరఫున గెలిచిన చారిత్రాత్మక తీర్పు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరము డిసెంబర్ 17వ తేదీ పెన్షనర్స్ దినోత్సవం జరుపుకోవడం అన్నవాయితీగా జరుపుకుంటున్నమన్నారు. అందులో భాగంగా ఇటీవల మార్చి మాసంలో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రి వలిడేషన్ చట్టం ద్వారా 1982 సుప్రీమ్ కోర్ట్ లో జస్టిస్ వై. వి. చంద్రచుడ్ తీర్పు స్ఫూర్తికి వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని వ్యతిరేకించడం జరిగిందన్నారు. 8 వ వేతన సంఘమ్ లో పెన్షనర్ల సమస్య ను చేర్చడం 8 వ వేతన సిఫార్సులు 1-1-2026 నుండి అమలు పరచాలన్నారు. డాట్ లేదా బీసనల్ పెన్షనర్లు కు సంబందించిన పెన్షన్ రెవిషన్ వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. అనంతరం 75 సంవత్సరాలు పై బడిన 14 మంది పెన్షనర్లను ఘనంగా సన్మానించారు.
ఇటీవల కొచ్చిన్ లో జరిగిన అఖిలభారత సదస్సులు అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన ఎం రాజశేఖర్ రెడ్డిని ఘనంగా అభినందిస్తూ సన్మానించడం జరిగింది. పెన్షనర్లు ఐక్యమత్యంతో పెన్షనర్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి బాల రంగయ్య, అధ్యక్షులు ఓ. బాబయ్య, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విశ్వనాథ్, పద్మనాభచారి, సుభాన్, పి వెంకట్ నారాయణ మొదలగువారు పాల్గొని విజయవంతం చేశారు. (Story:బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ లో ఘనంగా పెన్షనర్స్ దినోత్సవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!