Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేది ఎస్. టి.యు మాత్రమే

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేది ఎస్. టి.యు మాత్రమే

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేది ఎస్. టి.యు మాత్రమే

న్యూస్ తెలుగు / వినుకొండ : పల్నాడు జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వినుకొండ ఏరియా సమావేశం స్థానిక 11వ వార్డు పాఠశాలలో వేముల ఆంజనేయులు అధ్యకతన జరిగింది. ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా అధ్యక్షులు ఎల్వి రామిరెడ్డి మాట్లాడుతూ. ఉపాధ్యాయుల పక్షాన ఎప్పుడు ఉద్యమాలు చేయడానికి ఎస్టియు సిద్ధంగా ఉంటుంది, ఉపాధ్యాయుల సంఘంగా ఎస్ టి యు ఉపాధ్యాయులు పక్షాన పోరాడుతుంది అని తెలిపారు. అదేవిధంగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర జిత్ యాదవ్ మాట్లాడుతూ. నూతనంగా వచ్చేసిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతూ సంఘం ప్రాముఖ్యత, ఉద్యమాల ద్వారా ఎటువంటి సమస్యనైనా మనం పరిష్కరించుకోవచ్చు, సాధించుకోవచ్చు ఉద్యమాల ద్వారానే అనేక విజయాలు సాధించాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మండల విద్యాశాఖ అధికారి జఫరుల్లా మాట్లాడుతూ. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి నైపుణ్యం కలిగిన బోధన అందించాలని, విద్యార్థులలో ఉన్న అంతరంగిక నైపుణ్యాలను వెలికి తీయడంలో ముందు ఉండాలని, విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్ టి యు నాయకులు యేసయ్య, రామకోటయ్య, సుభాని, వినుకొండ ఏరియా, బొల్లాపల్లి, నూజండ్ల, వినుకొండ మండలాల ఎస్టియు నాయకులు, బాలకృష్ణ , రాజేశ్వరరావు, సురభి నాగరాజు కృపదాస్, కార్యకర్తలు మరియు నూతన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా 2025 పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహితలైన 15 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. (Story:ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేది ఎస్. టి.యు మాత్రమే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!