Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సాలూరులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

సాలూరులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

సాలూరులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

న్యూస్ తెలుగు /సాలూరు: సాలూరు పట్టణం లోగల మున్సిపల్ ప్రైమరీ స్కూల్ శ్రీ రామా కాలనీ సాలూరులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి 2 నల్ల వెంకటరావు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది . ఈయన మాట్లాడుతూ దివ్యంగుల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా తల్లిదండ్రులను కోరడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులు పిల్లలకు గవర్నమెంట్ అందించే సౌకర్యాలు గురించి వివరించడం జరిగింది. మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ ధనలక్ష్మి మాట్లాడుతూ మన స్కూల్లో భవిత కేంద్రము విలీనం చేయడం జరిగింది. మన స్కూలుకి 20 మంది ప్రత్యేక అవసరాల పిల్లలను నమోదు చేయడం జరిగింది వారందరికీ రవణ భత్యం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ స్కూల్ ,కాలేజీలు చదువుతున్న పిల్లలకు రవణ భత్యం ,ఎస్కార్ట్ ఎలివేషన్స్, గర్ల్స్ స్టెఫ0డు, హోమ్ బేస్ అలయన్స్ ఇవ్వడం జరుగుతుంది అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహితి విద్యా ఉపాధ్యాయులు వి. జగన్మోహన్రావు, సిహెచ్.అప్పలనాయుడు మరియు ఎం ఆర్ సి సిబ్బంది పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బహుమతులు మండల విద్యాశాఖ అధికారి మరియు హెచ్ఎం ధనలక్ష్మి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది.(Story:సాలూరులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!