నవజీవన్ ఆశ్రమం ఆధ్వర్యంలో హెచ్ఐవి పేషెంట్లకు ..దివ్యాంగులకు ఆర్థిక సహాయం
న్యూస్ తెలుగు /సాలూరు : నవజీవన్ ఆశ్రమం ఆధ్వర్యంలో హెచ్ఐవి, దివ్యాంగుల రోగులకు న్యూట్రిషన్ , కిరాణా వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని నవజీవన్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ చిన్నమ్మలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా మా సంస్థ యొక్కహెడ్ ఆఫీస్ తిరుపతి డాక్టర్ కే శ్రీధర్ ఆచార్య ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆర్థిక సహాయంతో న్యూట్రిషన్ ఫుడ్ మరియు కిరాణా హెచ్ఐవి పేషెంట్లకు అలాగే దివ్యాంగులకు 50 మందికి ఇవ్వడం జరిగిందని తెలిపారు దీనికి హాజరైన వాళ్ళు లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బిసెట్టి బాబ్జి సాలూరు హైస్కూలు ఇన్చార్జి ప్రిన్సిపల్ సత్యనారాయణ పి గోపి నవజీవన్ బ్రాంచ్ వైజాగ్ సిహెచ్ స్వాతి ఎల్వి రాజు న్యూట్రిషన్ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ మరియు కిరాణా ఐటమ్స్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.(Story:నవజీవన్ ఆశ్రమం ఆధ్వర్యంలో హెచ్ఐవి పేషెంట్లకు ..దివ్యాంగులకు ఆర్థిక సహాయం)

