పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీళ్లు ఇవ్వాలి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. సోమవారం సాయంత్రం మాజీ మంత్రి మాట్లాడారు పాలమూరులో తట్ట మన్ను తీయలే అని పేర్కొన్నారు.
చూసుకోని ముర్వ .. చెప్పుకుని ఏడ్వ అన్నట్లుంది పాలమూరు పరిస్థితి అని , పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏం లేదుఅని మాజీ మంత్రి ప్రశ్నించారు. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక్క పని కూడా చేసింది లేదుఅని, శంకుస్థాపనలు తప్ప రెండేళ్లలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఒక్క ఇటుక కూడా వేయలేదు అని మాజీ మంత్రి చెప్పారు.
కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్పడానికి కొంచెం అయినా సిగ్గు ఉండాలి అని మాజీ మంత్రి చెప్పారు.
పదేళ్లలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.48 లక్షల కోట్లు .. చేసిన అభివృద్ధి, గణాంకాలు కండ్ల ముందు ఉన్నాయిఅని మాజీ మంత్రి చెప్పారు. కేవలం రెండేళ్లలో కార్పోరేషన్ రుణాలు కాకుండానే రూ.2.50 లక్షల కోట్లు అప్పుచేశారుఅని మాజీ మంత్రి చెప్పారు.
సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు .. అభివృద్ధి పనులు పక్కనపెట్టారుఅని చెప్పారు. రైతులను గాలికి, పంటలను వాటి కర్మానికి వదిలేశారుఅని,
బోనస్ అని బోగస్ మాటలు చెప్పారు .. బ్రోకర్ల అవతారం ఎత్తారుఅని చెప్పారు. తెలంగాణ రైజింగ్ అంటూ అప్పులు తెస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది అని, కరోనా కష్టకాలం లోనూ తెలంగాణ రెవెన్యూ 25 శాతం వరకు పెరిగింది అని మాజీ మంత్రి చెప్పారు. కాంగ్రెస్ పాలన పుణ్యాన ఈ ఏడాది – 0.76 % శాతానికి పడిపోయింది అని , అడ్డగోలు అప్పులు చేసి అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తూ రైజింగ్ అంటూ పొంకనాలు కొట్టడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనం అని మాజీ మంత్రి చెప్పారు. కూట్ల రాయి తీయలేనోడు .. ఏట్ల రాయి తీస్తా అన్నాడట .. కొడంగల్ సభలో రేవంత్ 2034 నాటికి ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అని చెప్పడం హాస్యాస్పదం అని మాజీ మంత్రి చెప్పారు. పంచాయతీలను రెండేళ్ల పాలనతో భ్రష్టు పట్టించిన రేవంత్ అభివృద్ధి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందిఅని , విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు అని మాజీ మంత్రి చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులను గాలికి వదిలేశారుఅని
రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. (Story:పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీళ్లు ఇవ్వాలి)

