సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం హర్షినియం
న్యూస్ తెలుగు /వినుకొండ : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజులు పాటు కల్పిస్తూ టీటీడీ ప్రకటించడం హర్షనీయమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30వ తేదీ నుండి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు భక్తులకు ఈ ప్రత్యేక దర్శనవకాశం ఇస్తూ సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమన్నారు. పది రోజుల కాలంలో 182 గంటల దర్శన సమయం ఉండగా.. అందులో 104 గంటలు సాధారణ భక్తులకే ప్రత్యేకంగా కేటాయిస్తూ తీసుకున్న టిటిడి నిర్ణయం సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. వైకుంఠ దర్శనాల ప్రారంభమయ్యే మూడు రోజులు రూ. 300 దర్శనం, శ్రీవాణి దర్శనాలు రద్దుచేసి, జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు రోజుకు 15 వేలు రూ. 300 దర్శన టికెట్లు,1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించడం, మొదటి మూడు రోజులకు ఈ- డ్రిప్ ద్వారా టికెట్లు కేటాయించడం శుభపరిణామన్నారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తూ టీటీడీ ప్రకటించడం జరిగింది అన్నారు. డిసెంబర్ 2న లాటరీ విధానంలో ఎంపికైన వారికి టోకెన్లు కేటాయించారని, టీటీడీ వెబ్సైట్ తోపాటు, మొబైల్ యాప్, సిస్టం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ టోకెన్ కేటాయింపు పారదర్శకంగా జరిపేందుకు టీటీడీ అవకాశం కల్పించిందన్నారు. అంతేకాకుండా వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతి తిరుమల ప్రాంత స్థానిక భక్తులకు జనవరి 6,7,8 తేదీల్లో రోజుకు 5000 టోకెన్లు కేటాయించిందన్నారు. వివిఐపి లకు, విఐపి లకు లభించే వైకుంఠ ద్వార దర్శనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సామాన్య భక్తులకు సర్వదానం చేయటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. (Story:సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం హర్షినియం )

