Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ధ్రువపత్రాల కోసం ప్రజల్ని కార్యాలయాల చుట్టు తిప్పొద్దు..

ధ్రువపత్రాల కోసం ప్రజల్ని కార్యాలయాల చుట్టు తిప్పొద్దు..

ధ్రువపత్రాల కోసం ప్రజల్ని కార్యాలయాల చుట్టు తిప్పొద్దు..

*అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు చేరాలి
*అర్జీల్ని సచివాలయ ఇన్‌ఛార్జ్‌లు బాధ్యతగా తీసుకోవాలి
*ప్రజా సమస్యలు, అభివృద్ధిపై సమీక్షలో చీఫ్‌ విప్ జీవి

న్యూస్ తెలుగు/వినుకొండ :  వినుకొండ నియోజకవర్గం మొత్తంలో ఎక్కడా కూడా ధ్రువపత్రాల కోసం ప్రజల్ని పదేపదే ప్రభు త్వ కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితులు ఉండకూడదని చీఫ్‌విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కలసికట్టుగా పనిచేయాల్సి న అవసరం ఉందన్నారు. గత ఎమ్మెల్యే ఎలా దుర్భాషలాడారో అందరూ చూశారని, కానీ తమ సంస్కారం అది కాదని, ఉద్యోగులను గౌరవిస్తామని, ప్రేమిస్తామని, సహకారం అందిస్తామని, కష్టాల్లో ఉంటే ఆదుకుంటామని పేర్కొన్నారు. తనతో పాటు కూటమి నాయకుల సహాయ సహకారం కూడా అధికారులకు ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి తోడు ఉంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో వినతుల విషయంలో జవాబుదారీతనంలో వ్యవహిరించాల్సిన అవసరం ఉందన్నారు. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో శనివారం ఆ మేరకు చీఫ్ విప్ జీవి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందించాల్సిన సేవలు, పట్టణ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. అనం తరం మాట్లాడుతూ ధ్రువపత్రాల కోసం ప్రజలను పదేపదే తిప్పకుండా సకాలంలో సేవలు అందించాలని, అందుకు సచివాలయాల ఇన్‌ఛార్జులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇదే విషయంపై సమావేశాలు ఏర్పాటు చేసి సిబ్బందికి స్పష్టంగా చెప్పాలని, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో విధివిధానాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వార్డు, బూత్‌లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఎవరైనా అవినీతి జలగల్లా ప్రజలను ఏడ్పిస్తే కఠిన చర్యలు తప్పవని, బదిలీనే కాక సస్పెండ్ చేసేవరకు వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు. యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలన్న చంద్రబాబు పిలుపుతోనే నాడు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, ఆ రోజు నుంచీ ప్రజలకు సేవచేయాలన్న ఒకేఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. తనకు వచ్చే వందల కోట్ల ఆదాయం కంటే కూడా జన్మభూమి రుణం తీర్చుకోవడమే ముఖ్యమని, ఇప్పటికీ కూడా రాత్రింబవళ్లు పనిచేయడానికి కారణం ఆ తపనే అని చెప్పారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనతో పాటు వినుకొండ పట్టణాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. (Story:ధ్రువపత్రాల కోసం ప్రజల్ని కార్యాలయాల చుట్టు తిప్పొద్దు..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!