Homeవార్తలుతెలంగాణప్రజలతో మర్యాదగా, విధుల్లో నిజాయితీతో వ్యవహరించాలి

ప్రజలతో మర్యాదగా, విధుల్లో నిజాయితీతో వ్యవహరించాలి

ప్రజలతో మర్యాదగా, విధుల్లో నిజాయితీతో వ్యవహరించాలి

వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

న్యూస్‌తెలుగు/వనపర్తి:

వనపర్తి జిల్లా డీసీఆర్బీ (జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
) డీఎస్పీగా బాలాజీ నాయక్ బుధవారం రోజు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీరావుల గిరిధర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…పోలీసు వృత్తి ఒక సేవాధర్మం. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సానుభూతితో పరిష్కరించడమే నిజమైన పోలీసు ధర్మం. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలనతో వ్యవహరిస్తే ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించవచ్చు. మీరు పనిచేసే ప్రతి రోజు ఒక ప్రేరణగా ఉండాలి, ప్రజల నోట ఒక మంచి మాట వినిపించాలి అదే మీకు లభించే గొప్ప బహుమతి” అని ఎస్పీ సూచించారు. బాలాజీ నాయక్ గారు ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వహించి వనపర్తి జిల్లాకు బదిలీపై వచ్చి బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. వనపర్తి డిసిఆర్బీ డీఎస్పీ ఉమా మహేశ్వరరావు డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. (Story:ప్రజలతో మర్యాదగా, విధుల్లో నిజాయితీతో వ్యవహరించాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!