ఫస్ట్ వార్డ్ స్కూల్లో స్వచ్చాంధ్ర కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ జిల్లా, మెజిస్ట్రేట్ డా. కృతిక శుక్ల ఐఎఎస్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా. షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఫస్ట్ వార్డ్ నందు చంద్రబోస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ దీవస్ నవంబర్ నెల థీమ్ గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ. వ్యక్తిగత -పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మల మూత్ర విసర్జన నివారణ, హ్యాండ్ వాష్, స్వచ్ దీపావళి, పర్యావరణ పరిరక్షణ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలు, ఆహారం ను వృద చేయడంలో ఎదురుకొనే సవాళ్లు, మొదలగు వాటి గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. అదే విధంగా ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న శ్రీ సాయి హాస్పిటల్ డాక్టర్. సుంకర అనూష మాట్లాడుతూ.మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ఆరోగ్యానికి సంబంధించినవి గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ మరియు ఇతర స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల ముప్పు మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. నెలసరి సమస్యలు, నెలసరి సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి, గర్భాశయ సమస్యలు, మరియు పరిశుభ్రత లోపించడం వంటివి సాధారణం కావున మహిళలు ఆరోగ్యకరమైన జీవితశైలి, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, మరియు అవసరమైన చికిత్స తీసుకోవడం ముఖ్యం అని మరియు ఇతర సమస్య ల పై విద్యార్థుల కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ శైలజ, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ,సచివాలయ సిబ్బంది, శానిటరీ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.(Story : ఫస్ట్ వార్డ్ స్కూల్లో స్వచ్చాంధ్ర కార్యక్రమం )

