ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధుల నిరసన
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ సాక్షి పత్రిక సంపాదకులు ఆర్. ధనుంజయ రెడ్డి పై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా సాక్షి విలేకరులపై కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా వినుకొండ పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి డిప్యూటీ తాసిల్దార్ మురళి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు పాల్గొన్నారు.(Story : ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధుల నిరసన )

