తెలుగు తేజం అవార్డు” అందుకున్న కవి కమలా రామ్
న్యూస్ తెలుగు/వినుకొండ : అంతర్జాతీయ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ మరియు జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఈశ్వరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన ‘ తెలుగుతేజం’ పురస్కారం వినుకొండ జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు, జాషువా సమాఖ్య గౌరవ అధ్యక్షులు మరియు రచయిత జీ కమలారామ్ కు అందజేసినట్లు ప్రతాప్ తెలిపారు. ఆదివారం నరసరావుపేటలో నిర్వహించిన తెలుగు భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు భాష సంబరాలు కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఎన్నో ఏళ్లుగా సాహితీ రంగంలో మరియు కళా రంగంలో సేవలు చేస్తున్న రచయితలకు ఈ అవార్డును ప్రకటించినట్లు శ్రీశ్రీ కళా వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి టి పార్థసారథి తెలిపారు. ఇప్పటికే కవిరత్న, కళారత్న, సాహితి రత్న, నంది అవార్డులు పొందిన కమలారామ్” తెలుగు తేజం” అవార్డుకు ఎంపిక చేసినందుకు శ్రీశ్రీ కళావేదిక వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు తేజం అవార్డుకు అందుకున్న కమలారామ్ ని పట్టణ పుర ప్రముఖులు, మిత్రులు, కవులు, జన విజ్ఞాన వేదిక నాయకులు, జాషువా సమాఖ్య సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శాంతి బాయి తో పాటు తదితరులు పాల్గొన్నారు.(Story : తెలుగు తేజం అవార్డు” అందుకున్న కవి కమలా రామ్ )

