ఏబీ ఎం కాంపౌండ్ లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక ఏబీ ఎం కాంపౌండ్ లో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గణేష్ యూత్ మహిళల భక్తులు ఆధ్వర్యంలో అరుణ ,మల్లేశ్వరి, శిరీష, జానకి, మహేశ్వరి ,వీరి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ వినాయకుని ఏర్పాటు చేసి పూజ అనంతరం వివిధ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు లగడపాటి అంజయ్య, తులవ శ్రీనివాసరావు, సాదినేని శ్రీనివాసరావు, వట్టి కొండ నరేష్, బింగి చెన్నయ్య, ఉలవ నాసరయ్య, లాయరు రామకోటేశ్వరరావు, ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు, వరగాని శివశంకర్ బాబు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. (Story:ఏబీ ఎం కాంపౌండ్ లో ఘనంగా గణేష్ ఉత్సవాలు )

