Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు

వినుకొండలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు

వినుకొండలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు

స్థానిక పోలీస్ స్టేషన్లలో, రౌడీ షీటర్ల పెత్తనం..

అంబేద్కర్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది..

ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో, చర్చలకు సిద్ధం..

కూటమి ప్రభుత్వంపై, వైసీపీ నేతల మండిపాటు..

న్యూస్ తెలుగు /వినుకొండ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో వినుకొండ నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, సోమవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ. వైసీపీ కార్యకర్త రషీద్ హత్య, ఏనుగుపాలెంలో మహిళ హత్య, బొల్లాపల్లి లో హత్య, వినుకొండ పట్టణంలో హత్యలు, దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు బిక్కుబిక్కుమంటుంటే, వీటితో నాకేంటి సంబంధం అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అనడం హాస్యాస్పదంగా ఉందని పగడాల ఘాటుగా విమర్శించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత అజమాయిషి ఎమ్మెల్యే కు లేదా అని ఆయన ప్రశ్నించారు. శనివారం నూజెండ్ల మండలం అన్నారం గ్రామంలో జరిగిన సంఘటనను ఎమ్మెల్యే జీవి, జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావులు తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో వైసిపి ఏజెంటుగా ఉన్న ప్రసాద్ పై గోపి, రాంబాబు మరి కొంతమంది కక్ష పెట్టుకుని చందాల రూపంలో వచ్చి దాడి చేశారన్నారు. గోపి రాంబాబులు 2019 ఎన్నికల సమయంలో వైసీపీలోనే ఉన్నారని తర్వాత టిడిపిలోకి మారారు అన్నారు. వీరిరువురు వినుకొండ పట్టణంలో జరిగిన రషీద్ హత్య కేసులో సంబంధాలు ఉన్నాయని పగడాల అన్నారు. వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, వినుకొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకులు అమ్మిరెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్న వినుకొండ, ఆనాటి పులుపుల వెంకట శివయ్య కాలం నుండి నేడు జీవి వరకు రాజకీయాలు ఎంతో ప్రశాంతంగా ఉండి. వినుకొండ ప్రశాంతంగా ఉండేదని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి కక్షలు, కార్బన్యాలు పెరిగిపోయాయి అన్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పై, ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండేదని. అయితే నేటి సంఘటనలు, శాంతిభద్రతలు క్షీణించటం. దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడం, ప్రత్యర్థులను అణిచివేత ధోరణి ద్వారా, అధిష్టానం వద్ద మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానం ప్రజల్లో వస్తున్నదని అంజిరెడ్డి అన్నారు. దశాబ్దాల కాలంగా చూస్తే అతి తక్కువగా ఓటర్లు ఉన్న అన్నవరం గ్రామం, సిపిఐ కి అనుకూలంగా ఉండేదని. అనంతరం టిడిపి వర్గంగా మారిందన్నారు. అయితే ఇటీవల కాలంలో వైసీపీకి అతి తక్కువగా ఓట్లు పడినప్పటికీ. సహించలేని టిడిపి వారు ఈ దాడులకు దిగుతున్నారన్నారు. వీటన్నింటినీ నియంత్రించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే జీవికి లేదా అని అంజిరెడ్డి ప్రశ్నించారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్. ప్రసాద్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే జీవీ, మక్కెన మల్లికార్జున రావు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ది అంతా నటన అని అనడం పై.ఆయన తప్పు పట్టారు. నటనలన్నీ మంత్రి లోకేష్, స్థానిక కూటమినేతలవేనన్నారు. బొల్లా హయాంలో పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్నికల్లో బొల్లాకు కూడా లక్ష ఓట్లు వచ్చాయి అన్న సంగతి జీవి, మక్కెన మరిచిపోయారన్నారు. బొల్లా హయాంలో పట్టణంలో కోట్లాది రూపాయల విలువచేసే ఎన్ఎస్పి స్థలం ఆక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో ఖాళీ చేయించి మున్సిపాలిటీకి అప్పజెప్పిన సంగతి, కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని నిలువరించిన విషయం, ఎన్ఎస్పి కాలువ ఇరువైపులా సిమెంట్ రోడ్డు లైటింగ్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఆహ్లాద కరమైన వాతావరణము కల్పించింది మర్చిపోయారా అంటూ ప్రసాద్ ప్రశ్నించారు. గతంలో త్రాగునీటికి ప్రజలు అల్లాడుతున్న క్రమంలో ట్యాంకర్ల సంస్కృతి పారద్రోలి కేవలం నెల రోజుల్లో ఆక్రమణలకు గురైన సింగర చెరువును విస్తీర్ణపరచి సాగరజాలాల తో నింపడం ద్వారా నేటి వరకు పూర్తిస్థాయిలో త్రాగునీరు అందిస్తున్న బొల్లా శ్రమ ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి నియోజకవర్గంలో వైసిపి వర్గీయులపై, అభిమానులపై దాడులు మరింత పెరిగిపోయాయి అన్నారు. ఈపూరు, పలుకూరు ప్రాంతాలలో కొందరు గ్రామాలు విడిచి వెళ్లిపోయారన్నారు. గుమ్మనంపాడు, అల్లిబాయిపాలెం లో టిడిపి దాడులు జరగలేదా అని ప్రశ్నించారు. ఇక అన్నవరం గ్రామంలో జరిగిన ఘటనపై మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో టిడిపి వారు చనిపోయిన వారి ఓట్లు వేసే క్రమంలో పోలింగ్ బూతులో వైసీపీ ఏజెంట్గా ఉన్న ప్రసాద్ అడ్డుకోవడం జరిగిందని, అందువల్లనే ప్రసాద్ పై దాడి చేశారన్నారు. రాష్ట్రంలోనే కాదు వినుకొండ లో కూడా రెడ్ బుక్కు రాజ్యాంగం నడుస్తున్నదని, అంటూ బొల్లా హయంలో జరిగిన అభివృద్ధి పై, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని కూటమినేతలను వైసీపీ అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ కోరారు. ఈ సమావేశంలో కే కృష్ణారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గంధం బాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. (Story:వినుకొండలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!