సాలూరులో ఘనంగా స్త్రీ శక్తి పథకం ప్రారంభం

న్యూస్ తెలుగు /సాలూరు : స్త్రీ శక్తి పథకం ద్వారా 2.62 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించ వచ్చనని మహిళలకు చంద్రన్న ఇచ్చిన కానుకని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్తులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీ శక్తి ఉచిత బస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 74 శాతం బస్సుల్లో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణానికి అవకాశం ఉందని అన్నారు.కొత్త పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,942 కోట్ల భారం ఉన్న ఎన్నికలు ఇచ్చిన హామీను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వo చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
సూపర్ సిక్స్ పథకాల అమలు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పరిపూర్ణం చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో మరో సూపర్ సిక్స్ పథకం అమలుకు సిద్దమైందని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు మహిళలకు ప్రయాణ ఖర్చుల భారం నుంచి విముక్తి కల్పిస్తోందని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు 15న ప్రారంభించడం చాలా శుభ పరిణామం అని అన్నారు.. ఈ మేరకు శుక్రవారం స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించిన తరువాత మనం సాలూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా సూపర్ సిక్స్ పథకంలోని మరో ముఖ్యమైన పథకాన్ని అమల్లోకి తెచ్చినట్టు అవుతుందని అన్నారు. ఈ మేరకు రవాణ శాఖ, ఆర్టీసీ సిద్దమైంది. బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టిక్కెట్లు ఇవ్వడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ కూడా సిద్దం చేసిందని తెలియజేసారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు మహిళలకు ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రంలోని సుమారు 2.62 కోట్ల మంది మహిళలువినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని, ప్రభుత్వ అంచనా ప్రకారం మహిళలు వివిధ బస్సుల్లో వారానికి నాలుగు సార్లు సరాసరి ప్రయాణిస్తారని తెలియజేశారు. ఇక ఉద్యోగాలు చేసే మహిళలైతే రోజు వారీ ప్రయాణిస్తారను. దీని నిమిత్తం నెలకు ఒక్కో మహిళకు సుమారుగా రూ.1000 నుంచి రూ.3000 వరకు ఖర్చు అవుతుందని ఈ పథకం వలన రూపాయి కూడా ఖర్చు అవ్వదని అన్నారు.. ముందుగా కేవలం సిటీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే స్త్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా.. బస్సులో ప్రయాణించే ప్రతి పేద, మధ్య తరగతి, సామాన్య మహిళకు ప్రయాణ ఖర్చు తగ్గించాలి, దూర ప్రయాణాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
మొదటి నుంచి మహిళా సంక్షేమం
ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు అనేక కార్యక్రమాలు మహిళావర్గం కోసం అమలు చేస్తున్నారని అన్నారు. 1983లో పార్టీ పెట్టిన తర్వాత మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. 1986లో మహిళలకు ఆస్తిహక్కు తెచ్చారని అన్నారు. మహిళల కోసం పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారని,స్థానిక సంస్ధల్లో ఎన్టీఆర్ హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారను అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి కి.మీ.కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీ.కు ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కి.మీ.కు ఒక హైస్కూల్, ప్రతి మండలానికో జూనియర్ కళాశాల, ప్రతి డివిజన్ కో ఇంజినీరింగ్ కాలేజి, ప్రతీ జిల్లాకో మెడికల్ కాలేజ్, వందలాది ఇంజినీరింగ్ కాలేజీలు తెచ్చి మహిళలకు విద్యను దగ్గర చేశారని చెప్పారు. మహిళలకు విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్ధల్లో రిజర్వేషన్లు కల్పించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్, మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.(Story: సాలూరులో ఘనంగా స్త్రీ శక్తి పథకం ప్రారంభం)

