అంగన్వాడి విద్యార్థులకు అన్నప్రాసన చేసిన ఎమ్మెల్యే
న్యూస్తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ అంగన్వాడి కేంద్రంలో గురువారం నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై విద్యార్థులకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలను సైతం బలోపేతం చేస్తున్నామని కేంద్రాలకు వచ్చే చిన్నారులకు నాణ్యమైన పూర్వపు విద్యను అందించాలని ఎమ్మెల్యే అంగన్వాడి టీచర్లను ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యే గారికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ zptc వెంకటస్వామి, మాజీ ఎంపిటిసి సత్యారెడ్డి, సాయిచరణ్ రెడ్డి, తిరుపతిరెడ్డి, బాబూరెడ్డి, వెంకట్రామిరెడ్డి, టైలర్ రవి, గట్టు యాదవ్, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story :అంగన్వాడి విద్యార్థులకు అన్నప్రాసన చేసిన ఎమ్మెల్యే)

