Homeవార్తలుపూజా కార్యక్రమాలతో ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు

పూజా కార్యక్రమాలతో ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు

పూజా కార్యక్రమాలతో ఆరు కొత్త  స్క్రిప్టులు

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : ప్రముఖ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ, ఇవాళ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయనున్నారు. వేర్వేరు జానర్స్‌లో ఎప్పటిలాగే క్వాలిటీ స్టోరీటెల్లింగ్‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.

విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి స్థాపించిన 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇప్పటివరకు క్రిటిక్స్‌, ప్రేక్షకుల ప్రసంశలు పొందిన ఎన్నో హిట్‌ సినిమాలు అందించింది.

2015 – భలే మంచిరోజు (సుధీర్‌ బాబు, వామికా గబ్బి) – స్టైలిష్ యాక్షన్ కామెడీ, కల్ట్‌ హిట్‌గా నిలిచింది.

2017 – ఆనందో బ్రహ్మ (తాప్సీ పన్ను, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్) – హారర్ కామెడీని రీడిఫైన్ చేసింది.

2019 – యాత్ర (మమ్ముట్టి) – భావోద్వేగాలతో నిండిన పొలిటికల్ బయోపిక్, ప్రేక్షకులను అద్భుతంగా  ఆకట్టుకుంది

2021 – శ్రీదేవి సోడా సెంటర్ (సుధీర్‌ బాబు, ఆనంది) – సోషల్ మెసేజ్‌తో కూడిన విజువల్‌గా రిచ్ డ్రామాగా నిలిచింది.

వచ్చే ప్రాజెక్టుల గురించి నిర్మాతలు విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ – ప్రతి సినిమా థియేటర్‌ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది. మేము ఎప్పుడూ క్వాలిటీ కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తాం. ఈ ఆరు సినిమాలు కూడా అదే ట్రడిషన్‌ను కొనసాగిస్తాయి.

అద్భుతమైన నిర్మాణ విలువలతో ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చిత్రీకరించనున్నారు. డైరెక్టర్లు, హీరోల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ఇప్పటివరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించిన 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరోసారి కొత్త కాన్సెప్ట్స్‌తో ఎంటర్‌టైనింగ్ హిట్ సినిమాలు అందించేందుకు సిద్ధమవుతోంది.(Story:పూజా కార్యక్రమాలతో ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!