“ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డుకి ఎంపికైన వినుకొండ ఫోటోగ్రాఫర్లు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం వేడుకను క్రియేటివ్ కల్చర్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫోటో కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ,గుజరాత్ ,కర్ణాటక,మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఈ ఫోటో కాంటెస్ట్ లో పాల్గొన్నారు. వినుకొండకు చెందిన ఫోటోగ్రాఫర్స్ వంగపల్లి బ్రహ్మయ్య, కేసానపల్లి సుబ్బారావు లు ఈ “ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025 “అవార్డు కి ఎంపికయ్యారని మెయిల్ ద్వారా నిర్వాహకులు తెలిపారు. వంగపల్లి బ్రహ్మయ్య తీసిన “హ్యాపీనెస్” అనే చిత్రం అవార్డ్ కి ఎంపిక కాగా , కేసానపల్లి సుబ్బారావు తీసిన “వాటర్ క్యారీ” ఛాయాచిత్రానికి అవార్డు లభించినట్టు తెలిపారు. ఈనెల 18 న ఉదయం 11 గం.లకు విజయవాడలోని బాలోత్సవ భవన్ నందు ఈ అవార్డులను ఇరువురూ అందుకోనున్నారు. ఈ సందర్భంగా కాంటెస్ట్ చైర్మన్ గ్రాండ్ మాస్టర్ తమ్మా శ్రీనివాసరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని పలువురు ఫోటోగ్రాఫర్లు, పట్టణ ప్రముఖులు అవార్డు గ్రహీతలను అభినందించారు. (Story:”ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025″ అవార్డుకి ఎంపికైన వినుకొండ ఫోటోగ్రాఫర్లు)

