Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పేదలకు భరోసా సీఎం సహాయనిధి

పేదలకు భరోసా సీఎం సహాయనిధి

పేదలకు భరోసా సీఎం సహాయనిధి

న్యూస్‌తెలుగు/  వినుకొండ : పేద రోగులకు సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. చీఫ్ విప్ కార్యాలయంలో మంగళవారం బాదితులకు సీఎం సహాయనిది చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు వెంటనే మంజూరు చేసి ధైర్యం అందిస్తూ ఆర్థిక భరోసా ఇస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ఎవరు అనారోగ్య సమస్యలకు అప్పుచేసి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన పేదలకు ప్రభుత్వం ఆ ఖర్చును సీఎం సహాయ నిధి ద్వారా చెల్లించి ఆదుకోవడం జరుగుతుందన్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలు అవ్వకూడదన్న ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందజేసి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాలను ఆదుకుంటున్నారని తెలిపారు. నియోజవర్గంలోని 60 మంది లబ్ధిదారులకు 41 లక్షల69 వేలు చెక్కులను బాధితులకు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చేతుల మీదగా అందజేశారు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వినుకొండ నియోజకవర్గంలోని 647 మంది బాదిత కుటుంబాలకు 4 కోట్ల 55 లక్షలు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేసే ఆదుకోవడం జరిగిందన్నారు. సీఎం సహాయనిది అందుకున్న బాధితులు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:పేదలకు భరోసా సీఎం సహాయనిధి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments