సిపిఐ ద్వితీయ మహాసభలు జయప్రదం చేయండి..
ఎర్రజెండా రెపరెపలతో స్వాగతం పలుకుతున్న వినుకొండ
న్యూస్‌తెలుగు/ /వినుకొండ : వినుకొండ లో ఈనెల 7, 8 తేదీలలో జరిగే సిపిఐ పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 7వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు భారీ ప్రదర్శన ప్రదర్శనలో రెడ్ షర్ట్ లు, వాలంటీర్లు రెడ్ శారీలు ధరించిన మహిళలు, రాష్ట్ర జిల్లా నేతలు, కార్మికులు, కర్షకులు, సిపిఐ కి అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొననున్నాయి. సాయంత్రం 4 గంటలకు శివయ్య స్తూపం సెంటర్లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు అధ్యక్షులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ వ్యవహరించ నుండగా, ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, అతిథులుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా సహాయ కార్య దర్సులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, హాజరుకానుండగా, పల్నాడు జిల్లా నలుమూలల నుండి వచ్చే సిపిఐ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు వినుకొండ సిపిఐ నియోజకవర్గ సమితి ఆహ్వానం పలుకుతున్నది… ఉద్యమాలకు ఊపిరి పోసి ప్రజా సమస్యలపై దశాబ్దాల కాలంగా పోరాటాలు చేస్తూ ఆ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్న వినుకొండ కమ్యూనిస్టుల చరిత్ర వినుకొండ ప్రాంత ప్రజలకు తెలియంది కాదు… తొలినాటనుండి రాజకీయ ప్రత్యర్థులను సైతం ఆకర్షించబడుతూ కమ్యూనిస్టులు ప్రజా పాలన సాగిస్తూ నియోజకవర్గం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ఉంచుతూ వచ్చారు. కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య ఆనాడు ఎమ్మెల్యేగా గెలిచి సాదాసీదాగా ప్రజల్లో తిరుగుతూ నియోజకవర్గాన్ని ప్రశాంత వాతావరణంలో, అభివృద్ధి పథంలో ఉంచారు. అలాగే గంగినేని వెంకటేశ్వరరావు సమితి ప్రెసిడెంట్ గా, ఎమ్మెల్యేగా పనిచేసి వీళ్ళు రా కమ్యూనిస్టులు అనుకుంటూ ప్రజల అభిమానాన్ని పొందారు. అలాగే ఆనాడు ఎటువంటి అవినీతికి చోటు లేకుండా పాలన సాగిస్తూ ఉద్యోగుల బదిలీలు తదితర ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగారు. కాగా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర నినాదంతో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూ. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సమైక్యాంధ్ర సభలు జరగనివ్వని పరిస్థితుల్లో, తొలిసారిగా వినుకొండ లో పులుపులు వెంకట శివయ్య, పల్నాడు మందపాటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో అప్పటి గాంధీ విగ్రహం స్టేజి మీద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. శివయ్య ప్రసంగిస్తుండగా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమకారులు సోడా సీసాలు సభపై ఉసిరి వేయడం జరిగింది. వెంటనే కమ్యూనిస్టు కార్యకర్తలు వారిని వెంటాడి పరుగులు తీయించడం జరగా, ఒక దశలో ఎస్సై బాబురావు గాలిలోకి కాల్పులు జరపటం జరిగింది. అప్పటి శివయ్య స్ఫూర్తితో నేటి వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అలాగే వినుకొండ నియోజకవర్గంలో భూ పోరాట చరిత్ర రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో గుర్తింపు పొందింది. ఎన్నో పోరాటాల అనంతరం ప్రభుత్వం దిగివచ్చి రెవెన్యూ కార్యాలయాల ఆవరణలోనే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పేదలకు భూములు పంపిణీ చేయడం జరిగింది. ఉమ్మడివరం, పిట్టంబండ, గణేశుని పాలెం పలు గ్రామాలలో భూ పోరాటాలు చేసి ప్రభుత్వం ద్వారా పేదలకు సాగుభూమి పట్టాలు ఇప్పించిన ఘన చరిత్ర వినుకొండ కమ్యూనిస్టు ఉద్యమానిది. ఆనాడు ఏదో, వినుకొండపై రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్లాడు. జటాయువు రాముడు కు చెప్పాడని అది రాముడు విన్నాడని ఆ విన్న పదం విను కొండ గా చెబుతుంటారు. ఇక కొండ కింద పట్టణంలో ఏ పేదవాడు కేకలు వేసిన కమ్యూనిస్టులు పరిగెత్తుకుంటూ వస్తారంటూ ప్రచారం కూడా ఉంది. అది వినుకొండ కమ్యూనిస్టుల చరిత్ర….. అలాగే ఒకప్పుడు చిన్న పట్టణం గా ఉన్న వినుకొండ క్రమేపి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినుకొండకు చేరుకున్న క్రమంలో కొన్ని పేద కుటుంబాలు కమ్యూనిస్టు కార్యాలయంకు వచ్చి తమకు ఇంటి స్థలాలు ఇప్పించండి అడుగుతున్న క్రమంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పట్టణ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాల్లో ఇంటి స్థలాలను చూపిస్తూ ప్రభుత్వం ద్వారా పట్టాలు ఇప్పించిన సంగతి ప్రజలకు తెలిసిందే. ఇప్పటికీ పట్టణం శివారు ప్రాంతాలలో సుమారు 30 కాలనీల వరకు ఏర్పాటయ్యాయి. ఆ కాలనీలు ఏర్పాటు సిపిఐదే, తద్వారా జనాభా పెరుగుతున్న క్రమంలో పంచాయతీగా ఉన్న వినుకొండ పట్టణం మున్సిపాలిటీగా రూపుదిద్దుకుంది ఆ ఘనత కూడా సిబిఐ దే.. ఇక 7, 8 తేదీలలో జరిగే పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా పట్టణంలో ప్రధాన సెంటర్లలో కమ్యూనిస్టు యోధుల ఫోటోలతో భారీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అలాగే శివయ్య స్తూపం రంగులతో తీర్చిదిద్ది విద్యుత్ వెలుగులతో కళకళలాడుతుండగా, ముఖ ద్వారం ఏర్పాటు చేసి నేతల ఫోటోలతో, ఎర్రజెండాలతో రెపరెపలాడిస్తున్నారు. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్, ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, ఐదు మండలాల పార్టీ కార్యదర్శులు నెల రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, గ్రామ గ్రామాన మహాసభల వివరాలు వివరిస్తూ , మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ, ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. (Story:సిపిఐ ద్వితీయ మహాసభలు జయప్రదం చేయండి..)

