Homeవార్తలుతెలంగాణవనపర్తికి మేలు చేస్తే అభినందిస్తాం.. కీడు చేస్తే ప్రశ్నిస్తాం

వనపర్తికి మేలు చేస్తే అభినందిస్తాం.. కీడు చేస్తే ప్రశ్నిస్తాం

వనపర్తికి మేలు చేస్తే అభినందిస్తాం.. కీడు చేస్తే ప్రశ్నిస్తాం

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తికి మేలు చేస్తే అభినందిస్తాం. కీడు చేస్తే ప్రశ్నిస్తాం ..ఎదిరిస్తాంఅని అఖిలపక్ష ఐక్యవేదిక తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మా పోరాట ఫలితంగా 600 కుటుంబాలకు మేలు చేసే విధంగా చిట్యాల డబుల్ బెడ్ రూమ్ లకు రోడ్డు వేయడాన్ని స్వాగతిస్తున్నాం. అక్కడ మిగతా సౌకర్యాలు కూడా చేయాలని సంబంధిత ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం . డబుల్ బెడ్ రూమ్ కు వెళ్లడానికి వేసే రోడ్డుకు స్థలం ఇచ్చిన దాత రమేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
గత కొన్ని రోజులుగా అఖిలపక్ష ఐక్యవేదిక పలు అంశాలపై పోరాటం చేస్తూ వస్తున్నది. కొన్ని విషయాలలో స్పందిస్తూ వాటిని సరిచేస్తున్న ఎమ్మెల్యే గారికి సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ, వనపర్తి లో జరిగే పలు అవినీతి, అక్రమాలను కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని, ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందనీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి ప్రధాన అంశంగా తీసుకుని అవినీతిపరులను ఓడిస్తామని, మున్సిపాలిటీలో నీతివంతంగా పాలన జరిగే విధంగా సూచనలు ఇస్తూ అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. టఫ్ ఐ.డీ.సీ నిధులు కొందరు కింది స్థాయి నాయకులు ఇష్టానుసారంగా వాడుతున్నారని అవసరమైన చోట కూడా రోడ్లు కాలువలు వేయాలని ప్రజల కోరుతున్నారని అవసరమైతే ఐక్యవేదిక తరపున మేము సూచిస్తామని ఎమ్మెల్యే నీ కోరడమైనది. వనపర్తి జిల్లాలో కూడా ఎక్కడ అవసరమైనా అక్కడ ఐక్యవేదిక పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, రామస్వామి, కురుమూర్తి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. (Story:వనపర్తికి మేలు చేస్తే అభినందిస్తాం.. కీడు చేస్తే ప్రశ్నిస్తాం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!