Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజల కోసం పని చేయడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత

ప్రజల కోసం పని చేయడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత

ప్రజల కోసం పని చేయడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత

ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

న్యూస్ తెలుగు / వినుకొండ : ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేయడం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అని చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందుకు తగ్గట్లే ప్రజల సమస్యల పై వెంటనే స్పందించి పరిష్కారం చూపడమే తమ ధ్యేయమన్నారు. వినుకొండలోని చీఫ్‌ విప్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై 74 అర్జీలు వచ్చాయి. అవన్నీ ఓపికగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెవిన్యూ, త్రాగునీరు, విద్యుత్ సమస్యలపై సహా తదితర అంశాలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో అప్ప టికప్పుడే కొందరి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కారించాలని సూచించా రు. అనంతరం మీడియాతో మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ప్రతి ఫిర్యాదు వ్యక్తిగతంగా పరిశీలించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై సానుభూతితో స్పందించడమే కూటమి ప్రభుత్వ విధానం అన్నారు. ఏడాదిగా రాష్ట్రంలో ప్రజల నమ్మకానికి విలువ ఇస్తూ ప్రభుత్వం నడుస్తోం దన్న ఆయన ప్రతి సమస్యను ఓ బాధ్యతగా స్వీకరిస్తామని స్పష్టం చేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆ విషయంపై ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చేందుకే సమస్యల పరిష్కారానికి వారానికి ఒక్కరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిడిసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. (Story:ప్రజల కోసం పని చేయడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!