ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం: వక్తలు
న్యూస్తెలుగు/వనపర్తి : జిల్లాలో ప్రజా పోరాటాలతోని ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ అన్నారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో ఆత్మకూరు సిపిఐ జిల్లా మహాసభలకు వెళ్లే వాహనాలను భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ ఎర్రజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. దున్నేవాడికి భూమికోసం పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాల కోసం రైతులకు రుణమాఫీ కోసం,కూలీలకు గిట్టుబాటు ధర కోసం, రైతుకు గిట్టుబాటు రేటు కోసం సిపిఐ పోరాడుతూ వస్తోందన్నారు. వందేళ్ళ సిపిఐ పోరాటంలో ఎన్నో విజయాలను సాధించిందన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి తాగు సాగునీరు సంక్షేమ పథకాల కోసం పోరాడాలు ఉన్నారు. అందుకు సిపిఐ లో చేరాలన్నారు. అనంతరం వాహనాలలో ఆత్మకూర్ బయలుదేరి వెళ్లారు. జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, పానగల్ మండల కార్యదర్శి డంగు కురుమయ్య, పెంటయ్య, పెద్ద హనుమంతు, జ్యోతి తదితరులుఠ పాల్గొన్నారు. (Story:ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం: వక్తలు)

