Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ

అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ

అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక బోసుబొమ్మ సెంటర్లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కి ఆషాడమాసం సందర్భంగా ఆర్యవైశ్య సదావర్తి సంఘం ఆధ్వర్యంలో ఆషాడమాస పట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కి శాకంబరీ దేవి అలంకారం చేయటం జరిగింది . ముందుగా స్థానిక రంగనాయక స్వామి దేవస్థానం వద్దనుండి ఆర్యవైశ్య సదావర్తి సంఘం సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రాగా కోలాట భజనలతో జై వాసవి నామస్మరణతో మెయిన్ బజార్ గుండా మేళతాళాలతో ఊరేగింపుగా బోసు బొమ్మ సెంటర్లోని వాసవి అమ్మవారి దేవస్థానం వద్దకు రావడం జరిగింది. ఈ సందర్భంగా సదావర్తి సంఘం అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జి మాట్లాడుతూ.. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతనక పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వాసవి అమ్మవారికి ఆషాడ మాస పట్టి కార్యక్రమంతో నిర్వహించడం జరిగిందని ఇందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం వాసవి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరికీ ఆయురారోగ్యాలు అమ్మవారి ప్రసాదించాలని తెలియజేశారు. ఇంకా భవిష్యత్తులో వాసవి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి మరియు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి స్పష్టమైన ప్రణాళికన సిద్ధం చేసుకున్నామని దానికి అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకొని అందరి సహాయ సహకారాలతో కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమలు, గాజులు, సారె సామాగ్రి సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాల స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సదావర్తి సంఘం గౌరవ అధ్యక్షులు తాతా సత్యనారాయణ, సెక్రటరీలు పెరుమాళ్ళ అమర్నాథ్ రెడ్డి నగేష్ బాబు, కోశాధికారి పెండ్యాల సురేష్, సహకోసాధికారి కొల్లిపర నాగేశ్వరరావు, మండవ వెంకట కిరణ్ కుమార్, గజవల్లి నాగ పవన్ కుమార్, ఆర్యవైశ్య సదావర్తి సంఘం సభ్యులు పట్టణ ప్రముఖులు అందరు కూడా పాల్గొన్నారు.(Story : అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!