Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతిపౌరుడి న్యాయమే కూటమి ధ్యేయం

ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతిపౌరుడి న్యాయమే కూటమి ధ్యేయం

ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతిపౌరుడి న్యాయమే కూటమి ధ్యేయం

ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

న్యూస్ తెలుగు/వినుకొండ  : ప్రతి ఇంటికీ సంక్షేమంతో పాటు ప్రతిపౌరుడికి న్యాయమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, ఆ దిశగానే ప్రజాదర్బార్‌ల ద్వారా గణనీయమైన మార్పు తీసుకుని వస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి అధికారి అర్జీలు తిరిగి రాకుండా.. పరిష్కారమే అజెండా కావాలన్న లక్ష్యంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వినుకొండలోని చీఫ్‌ విప్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన నిర్వహించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై 185 అర్జీలు వచ్చాయి. అవన్నీ ఓపికగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్, రెవెన్యూ సమస్యలు, పింఛన్లు సహా తదితర అంశాలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో అప్ప టికప్పుడే కొందరి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కారించాలని సూచించారు. అనంతరం మీడియాతో చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడకు వచ్చే విజ్ఞప్తులపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసానికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లకుండా చూడాలని కోరారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు తమ బాధలు చెప్పడానికి ఎక్కడికీ వెళ్లలేక విసిగిపోయారని, ఇప్పుడు తలుపు తట్టగానే స్పందించే ప్రభుత్వాన్ని చూసి ఆశతో ముందుకు వస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతిపౌరుడి న్యాయమే కూటమి ధ్యేయం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!