Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

వినుకొండ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు

న్యూస్ తెలుగు/వినుకొండ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని సిపిఎం వినుకొండ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కార్మికుల, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు – రైతు సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ సోమవారం నిర్వహించారు. ర్యాలీ సిఐటియు కార్యాలయం నుండి పల్నాడు రోడ్ లోని విద్యుత్ సబ్ స్టేషన్, శివయ్య స్తూపం సెంటర్, చెకపోస్ట్ సెంటర్, నరసరావుపేట రోడ్డు, ఎల్ఐసి ఆఫీస్ వైపుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీకి మద్దతు తెలిపిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయాణం కోసం కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కార్డులను రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కై జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బైక్ ర్యాలీలో సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కే హనుమంతరెడ్డి రైతు సంఘం నాయకులు కే శివరామకృష్ణ, కోటిరెడ్డి, కే పి ఎస్ నాయకులు జి నవీన్ కుమార్, కృష్ణమూర్తి, భవన నిర్మాణ సంఘం నాయకులు పి వెంకటప్పయ్య, శ్రీనివాసరావు, చాంద్ భాష, సుభాని తదితరులు పాల్గొన్నారు. (Story:9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!