కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో కట్టి సాగునీరు అందించిన ఘనత కెసిఆర్ ది
న్యూస్ తెలుగు/వనపర్తి : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో కట్టి సాగునీరు అందించిన ఘనత కెసిఆర్ దిఅని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్(TSF) ఆధ్వర్యములో తెలంగాణ జలవనరులు..వ్యవసాయం…నాడు,నేడు,రేపు రౌండ్ టేబుల్ సమావేశం హైద్రాబాద్ షోయబ్ హాల్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నీళ్ల ప్రాధాన్యత,నేటి పాలకులు సాగునీటి నిల్వలో నిర్లక్ష్యం చేస్తున్న విధానాలను సోదాహరణంగా వివరించారు.వందల ఏండ్ల క్రింద సాగునీటి ప్రాజెక్టులు లేనందున వృథాగా పోతున్న నీళ్ళ వల్ల సారవంతమైన భూములు కొట్టుకుపోయి సముద్రములో కలవడం మిగతా భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోవడం,సకల జీవరాశుల జీవనం దుర్భేద్యం కావడం గమనించిన నాటి తెలంగాణ పాలకులు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని నిల్వ చేసి భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేశారని కొనియాడారు. నేటి పాలకులు ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో మనకు దక్కాల్సిన నీటి వాటాలు ఇతర రాష్ట్రాలకు తరలుతున్నాయని దుయ్యబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున సాగర్,శ్రీశైలం,జూరాల వంటి ప్రాజెక్టులు కట్టడానికి పాలకులు 20,30,40ఏండ్లు సాగదీసారని కానీ కె.సి.ఆర్ మూడున్నర ఏండ్లలో కాళేశ్వర్ ప్రాజెక్ట్ నిర్మించి కోటి ఎకరాలకు నీళ్లు అందించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం 90శాతం పూర్తి చేశారని ప్రస్తుత పాలకులు మిగిలిన 10శాతం పనులు కూడా చేయలేకపోతున్నారు అని దుయ్యబట్టారు.
ప్రస్థుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోవు తరాలు మరో గ్రహం మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం వస్తుందని జోస్యం చెప్పారు. ఓటెందు.నరసింహ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి జాన్ వెస్లీ,శ్రీధర్ రావు దేశ్పాండే,వేణుగోపాల్ స్వామి,అయాచితం.శ్రీధర్,తన్నీరు.వెంకటేశం పాల్గొన్నారు.(Story : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో కట్టి సాగునీరు అందించిన ఘనత కెసిఆర్ ది )

