యస్ పి ముందు లొంగిపోయిన 18 మంది మావోయిస్టులు
న్యూస్ తెలుగు/ చింతూరు : చతిస్గడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కేంద్రంలో ఎస్పి కిరణ్ చౌహాన్ ఎదుట 18 మంది మావోయిస్టులు మంగళవారం లొంగిపోయారు. సుకుమార్ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా సౌత్ బస్తర్ డివిజన్ పి ఎల్ జి ఏ నెంబర్ వన్ బెటాలియన్ తో సంబంధం ఉన్న నలుగురు హార్డ్ కోర్ మావోయిస్టులతో పాటు 18 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకొని లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ 39 లక్షల రివార్డు ప్రకటించారు. చతిస్గడ్ ప్రభుత్వం మావోయిస్టుల లొంగుబాటు పునరావాసం విధానం కింద నిర్వహించబడింది. ఈ పథకం ప్రకారం మావోయిస్టు గ్రామపంచాయతీ ప్రకటించిన పంచాయతీకి కోటి రూపాయల అభివృద్ధి నిధి ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ ప్రయత్నాల వల్ల ప్రభావితమై చాలామంది మావోయిస్టులు జనజీవన స్రవంతి లో చేరడానికి ముందుకు వస్తున్నారు. లొంగిపోవటానికి జరిగే ప్రక్రియలో జిల్లా రిజర్వు గార్డ్స్, సుక్మా రేంజ్ ఫీల్డ్ టీం, కుంట, సుకుమా, జగదల్పూర్, సిఆర్పిఎఫ్ 80,212,219, కోబ్రా203 బెటాలియన్ల నిఘా విభాగాలు ముఖ్యమైన పాత్ర పోషించాయని ఎస్పి అన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా హింస మార్గం వీడి, లొంగిపోయి ప్రభుత్వ పునరావాస పథకాలను వినియోగించుకోవాలని కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తరచూ గాలింపు చర్యలు చేపట్టి, భద్రత దళాలు శిబిరాలను ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు బలహీనపడి లొంగిపోతున్నారని దీని ఫలితమే ఈ లొంగుబాటు చర్య అని అన్నారు. (Story: యస్ పి ముందు లొంగిపోయిన 18 మంది మావోయిస్టులు)

