Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌లోకేష్‌కు బాధ్యతలిస్తే మరో 40 ఏళ్లు అధికారంలో తెలుగుదేశం

లోకేష్‌కు బాధ్యతలిస్తే మరో 40 ఏళ్లు అధికారంలో తెలుగుదేశం

లోకేష్‌కు బాధ్యతలిస్తే మరో 40 ఏళ్లు అధికారంలో తెలుగుదేశం

జనసమీకరణపై పులివెందుల నేతలతో చీఫ్ విప్ జీవీ, బీటెక్ రవి సమావేశం

కడప మహానాడును విజయవంతం చేయాలని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పిలుపు

న్యూస్ తెలుగు/వినుకొండ  : మంత్రి లోకేష్‌కు ఈ సమయంలోనే తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ 40ఏళ్లు అధికారంలోనే ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో, ప్రజల్లో తనను తాను నిరూపించుకున్న ఆయనకు ఆ బాధ్యతలు ఇచ్చేందుకు ఇదే సరైన సమయమన్నారాయన. తెలుగుదేశం పార్టీ కోటిమంది క్రియాశీలక సభ్యత్వం గల కార్యకర్తలు, యువత, మేధావులు, విద్యావేత్తలు కూడా అదే ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. కడపలో 3రోజులపాటు నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆయన ఈ సందర్భంగానే లోకేష్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చూడాలని ఆశపడుతున్నట్లు చెప్పారు. సోమవారం ఈమేరకు పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ పరిశీలకుడు ఆదినారాయణ, బీటెక్‌ రవితో కలిసి నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పులివెందులలో ఎక్కడికెళ్లినా మహానాడుపై విశేష స్పందన లభిస్తోందన్నారు. నియోజకవర్గం నుంచి 15 వేలమందికిపైగా తరలివెళ్తున్నారని చెప్పారు. ఈ మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీని రానున్న 4దశాబ్దాలకు మహాశక్తిగా మ లిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. కడప ప్రాంతంలో సీఎం చంద్రబాబు హయాంలో చేపట్టిన పనులు బ్రహ్మాండంగా ముందుకెళ్లాయన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలుపెట్టిన పనులు, పూర్తికాని వాటిని కూడా తర్వాత పూర్తి చేయడాన్ని ప్రజలంతా అభినందిస్తున్నారని తెలిపారు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమ రైతులు రత్నాలు పండించే గొప్ప ప్రాజెక్టుగా పేర్కొన్నారు, వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి జలాశయం ఏర్పాటుతో ఆ ప్రాంతంలో కొంతమంది నష్టపోయే పరిస్థితి ఉంటుందని, ఐనా బహుళార్థ ప్రయోజనాల దృష్ట్యా త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు విజన్-2047 సాధించడానికి కూడా లోకేష్‌ లాంటి నవయువ నాయకత్వం అవసరం ఎంతో ఉందన్నారు. నాడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఐటీ, విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆ శాఖలకే వన్నె తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. వాట్సాప్‌ ద్వారానే 200కిపైగా పౌర సేవలు ఆయన కృషి కారణంగానే సాధ్యమైందన్నారు. పార్టీ పరంగా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా.. కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తున్నారని, అనుకోని ఘటనల్లో బాధితులైన వారి కుటుం బాలు రోడ్డున పడకుండా వారి పిల్లలకు చదువు అందిస్తున్నారన్నారు. ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్న వేలాదిమంది కార్యకర్తలను ఆదుకున్నారని తెలిపారు. పార్టీ క్లిష్ట పరిస్థి తుల్లో ఉన్నప్పుడు 400 రోజుల పాయు యువగళం పాదయాత్ర చేపట్టి అధికారంలోకి రావడా నికి కృషి చేసిన ఆయనకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇవ్వడం, అది కూడా కడప మహా నాడు వేదికగానే చేయడం ఎంతో సముచితంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : లోకేష్‌కు బాధ్యతలిస్తే మరో 40 ఏళ్లు అధికారంలో తెలుగుదేశం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!