Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శ్యామలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంధ్యారాణి

శ్యామలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంధ్యారాణి

శ్యామలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంధ్యారాణి

న్యూస్ తెలుగు/సాలూరు : శ్యామలంబ అమ్మవారి పండుగ ఎటువంటి అవాంతరాలు రాకుండా జరగాలని ఆ అమ్మవారిని మొక్కుకున్నానని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పట్టణంలో గల శ్యామలాంబ ఆలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా జన్ని వీధి లో ఉన్న అమ్మవారి గద్దె వద్ద అమ్మవారి ఘటాలుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గ ప్రజలకు శ్యామలాంబ అమ్మవారి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. 15 సంవత్సరాల నుండి ఏప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పండగ రావడంతో సాలూరు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఉత్సవ కమిటీ, అధికారులు, ప్రజల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అమ్మవారి దయతో ప్రజల సహకారంతో పండుగను విజయవంతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. అమ్మవారి ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ కృష్ణారావు, తాహసిల్దార్ రమణ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. (Story:శ్యామలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంధ్యారాణి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!