Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఉగ్రవాదులు దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ లో మంత్రి గొట్టిపాటి రవి

ఉగ్రవాదులు దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ లో మంత్రి గొట్టిపాటి రవి

ఉగ్రవాదులు దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ లో మంత్రి గొట్టిపాటి రవి

న్యూస్ తెలుగు/వినుకొండ : జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ శుక్రవారం వినుకొండలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించి స్థానిక శివయ్య స్తూపం వద్దకు చేరుకొని మానవహారం ఏర్పడి నిరసన తెలిపారు. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు మరణించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఉగ్రవాదుల చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. శాంతియుత పర్యాటకులపై జరిగిన ఈ దాడిని అందరూ ముక్తకంఠంతో ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున్ రావు, యార్లగడ్డ లెనిన్ కుమార్, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, కూటమి నాయకులు పాల్గొన్నారు.(Story : ఉగ్రవాదులు దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ లో మంత్రి గొట్టిపాటి రవి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!