నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన
సూడాన్: నాకు వరుడు కావాలని ఏ యువతీ బహిరంగంగా రోడ్డుపై నిల్చుని అడగదు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి ప్లకార్డు పట్టుకొని మరీ అడుగుతోంది. నల్లటి మాస్కు ధరించి ఓ యువతి.. ప్లకార్డు చేతబట్టి, నాకు వరుడు కావాలి అంటూ రోడ్డుపై నిల్చున్న యువతి ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సూడాన్ దేశంలో నెలకొన్న అనూహ్య పరిస్థితులకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. తల్లిదండ్రులే అమ్మాయికి మంచి సంబంధం చూసే పరిస్థితి ఇక్కడ లేదు. సుడాన్ దేశంలో యువతులే రోడ్లపైకి వచ్చి తమ భర్తలను వెతుక్కోవాల్సి వస్తున్నది. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందంటే…2018-20 మధ్య సూడాన్‌లో మ్యారెజ్‌ల రేటు గణనీయంగా తగ్గిందట. 2018తో పోల్చితే 2020 సంవత్సరంలో మ్యారేజ్ రేటు 21శాతం పడిపోయిందట. 2020లో ఒకేసారి 60 వేలకు పైగా జంటలు విడాకులు తీసుకున్నాయట. ఆ కారణంగానే సుడాన్‌లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అక్కడి మీడియా పేర్కొంది. ఇక ప్లకార్డు పట్టుకున్న యువతి విషయానికొస్తే…‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వరుడు కావాలి. గతంలో పెళ్లి అయిన వ్యక్తిని చేసుకోవడానికి కూడా నేను సిద్ధమే. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు నన్ను సంప్రదించండి’’ అనే వ్యాఖ్యాలతో కూడిన ప్లకార్డును చేతపట్టుకుని సూడాన్ రోడ్డుపై ఫోన్ నెంబర్ రాసి ఆ యువతి నిల్చుంది. దాంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనై ఫొటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ యువతి వార్తల్లో నిలిచింది. దానికి సూడాన్ యువత సపోర్ట్‌గా నిలిచారు. ఇది వాస్తవ పరిస్థితికి నిలువుటద్దమంటూ కామెంట్లు పెట్టారు. (Story: నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన)
See Also:
పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!
అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!
తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న