మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం
న్యూస్ తెలుగు/ వినుకొండ :మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించెందుకు తమ వంతు కృషి చేయాలని స్థానిక వినుకొండ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ని కలిసి వినతి పత్రం సమర్పిస్తున్న ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మారుతి వరప్రసాద్, ఏఐటియుసి నాయకులు బూదాల శ్రీనివాసరావులు, రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దశల వారి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నాడు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ని ఎఐటియుసి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల వేతనాల చెల్లింపుల విధానాన్ని మున్సిపల్ శాఖ కే పూర్తి బాధ్యతలు ఉండాలని, ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ మరియు డీఏలు సత్వరం విడుదల చేసి పరిష్కరించాలని, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుకై గత సమ్మె కాలంలో ఆనాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంటు మేరకు వేతనాలు పెంచి ఇవ్వాలని, మున్సిపాలిటీలలో జనాభా ప్రాతిపదికన కార్మికులను పెంచాలని, ఇంజనీరింగ్ ఒప్పంద సిబ్బందికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఏడాదికాలంగా పెండింగ్లో ఉన్న మరణించిన రిటైర్మెంట్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ వసతులు కల్పించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర యూనియన్ పిలుపునివ్వడం జరిగిందని కార్మికుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేయాలని వారు స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కి విజ్ఞాపన పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ కార్మికుల సమస్యలన్నిటిని అసెంబ్లీలో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రాయబారం వందనం పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కే. మల్లికార్జున, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పారిశుద్ధ్య కార్మికుల విభాగం అధ్యక్షులు సంపెంగుల అబ్రహం రాజు, ఇంజనీరింగ్ కార్మికుల విభాగం అధ్యక్షులు రేవళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శులు సాయిబాబు, నాగూర్ వలి, పచ్చి గొర్ల ఏసు, రాచపూడి ఎసు పాదం, బూదాల లక్ష్మయ్య, పల్లె ఏసోబు, నూనె వెంకటేష్, కంచర్ల కోటేశ్వరావు, పెద్దిటి స్వామి, మురికిపూడి నాసరయ్య, షేక్ కాజా మస్తాన్, మురుగుల నాగరాజు, సిహెచ్ సుబ్రమణ్యం, చినగాలయ్య తదితరులు పాల్గొన్నారు.(Story : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం)

