భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుకి సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు దుప్పల్లి నారాయణ కు సన్మానం చేశారు. భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షునిగా గత సంవత్సర కాలంలో రాష్ట్ర పార్టీ లక్ష్యానికి అనుగుణంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదులో వనపర్తి జిల్లా ను రాష్ట్రంలోని మొదటి పది స్థానలలో నిలిపి నూతన బూత్ కమిటీలు,మండల కమిటీలు,జిల్లా కౌన్సిల్ రాష్ట్ర కౌన్సిల్ నియామకాలను మండల జిల్లా , రాష్ట్ర నాయకుల సమన్వయంతో ఏకాభిప్రాయం ద్వారా పూర్తి చేసుకొని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు,కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్రమంత్రి బండి సంజయ్ ,రాష్ట్ర జాతీయ నాయకుల ఆశీర్వాదంతో నేడు మరొక్కమారు పూర్తిస్థాయిలో జిల్లా అధ్యక్షులు గా నియమితులైన సోదరులు దుప్పల్లి నారాయణ కి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం చేశారు. (Story : భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుకి సన్మానం)