శక్తిపీఠం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నమాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : శక్తిపీఠాలలో ఒక్కటైనా అలంపూర్ జోగులాంబ అమ్మవారిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయములో జరుగుతున్న హోమం,పూర్ణాహుతి యందు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ కొంకల.నాగేశ్వర్ రెడ్డి, E.O పురేందర్ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అర్చకులు అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశములో ఉన్న అష్ట శక్తిపీఠాలలో జోగులాంబ అమ్మవారు అత్యంత మహిమాన్విత శక్తివంతమైన దేవత అని ప్రపంచ భక్తులు ఎక్కువగా వచ్చే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జోగులాంబ దేవాలయం అభివృద్ధి కోసం ఆనాటి సి.ఎం.కె.సి.ఆర్ ప్రత్యేక చొరువ చూపారని అన్నారు. నిరంజన్ రెడ్డి వెంట సుల్తానపూర్.మధుసూదన్ రెడ్డి,మోహన్ రెడ్డి సింగిల్ విండో ఛైర్మెన్,జయరాములు మాజీ సర్పంచ్ తదితరులు ఉన్నారు.(Story : శక్తిపీఠం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నమాజీ మంత్రి )