త్వరలోనే కాన్ చెరువు కాలువ పూర్తి
ప్రతి ఎకరాకు సాగునీరు
పోడు భూములకు పట్టాలు
అర్హులైన అందరికీ ఇందిరా జలప్రభ లబ్ధి
ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం పెద్దగూడెం తండాకు సాగునీరు అందించే ఖాన్ చెరువు కాలువను త్వరలోనే పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు
కాలువ ఏర్పాటుకు కావలసిన అటవీశాఖ అనుమతులు వచ్చాయని త్వరలోనే కాలువ పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు
తండాలోని పోడు భూముల సమస్య పరిష్కరించి పోడు భూములు అందని లబ్ధిదారులకు పోడు భూముల అందేలా చర్యలు చేపడతామన్నారు
ఇందిరా జలప్రభ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చూస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు
నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతో గ్రామ గ్రామాన ప్రజాపాలన గ్రామసభలను నిర్వహించి ప్రజల నుంచి నేరుగా దరఖాస్తుల స్వీకరిస్తున్నామని ఆయన సూచించారు
రేషన్ కార్డులు, భూమి లేని నిరుపేదలకు అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా కు సంబంధించి అధికారులు స్వీకరించే ఈ దరఖాస్తులకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులేనని ఎవరు నిరాశ చెందరాదని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ లబ్ధి చేకూరాతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఈ సందర్భంగా గ్రామస్తులు విన్నవించిన సమస్యలన్నింటినీ పరిష్కరించి పెద్దగూడెం తండా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి కిరణ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, వాల్య నాయక్, ధర్మ నాయక్, అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. (Story : త్వరలోనే కాన్ చెరువు కాలువ పూర్తి)