అమర్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : పట్టణంలో ధర్మపురి రోడ్డు వద్ద ఉన్న అమర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో పాఠశాలకు విచ్చేశారు. పాఠశాల ప్రాంగణమంతా సంక్రాంతి సంబరాలలో భాగంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఇందుమతి మాట్లాడుతూ విద్యార్థులకు పండగ విశేషాలను తెలియపరచడంలో భాగంగా ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అత్యుత్తమ విద్యతోపాటు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల వారు అన్ని విషయాలలో చురుకుదనం ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. ఏటా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు పూర్తి సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలుతెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ వి పోలేశ్వర్రావు, అసిస్టెంట్ ప్రిన్సిపల్ శారద, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : అమర్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు)