వాలంటీర్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలి
ఉద్యోగ భద్రత కల్పించాలి
న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరు డివిజన్ పరిధిలో నాలుగు మండలాల్లో ఉన్న వాలంటరీ సమస్యలు పరిష్కరించాలని మూడవరోజు రిలే నిరాహార దీక్షని వి.ఆర్. పురం ఎంపీపీ కారం లక్ష్మి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పులి సంతోష్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వార్డ్ వాలంటరీ ఉపాధిని కాపాడుకోవాలి. గత ఏడు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు చెల్లించి వాలంటరీ కుటుంబాలను ఆదుకోవాలి. బలవంతంగా రాజీనామాలు చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్స్ కు ప్రశంసాలు అవార్డులు రివార్డులు తప్ప కనీస వేతనం. పని గంటలు. పని భద్రతలు విధివిధానాలు లేకుండా సాకిరి చేయించింది. సచివాలయ ఉద్యోగాలుగా గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరిన పట్టించుకోలేదుఅని అన్నారు. వాలంటరీల రిలే నిరాహార దీక్షకి కూనవరం మండలం పెద్దార్కుర్ సర్పంచ్ మడక నాగమణి మద్దతు తెలిపి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటరీ చేస్తున్న పోరాటానికి ప్రజాప్రతినిధులుగా మేం కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ . సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పోడియం లక్ష్మణ్. సిఐటియూ మండల కమిటీ సభ్యులు బీరబోయిన దిలీప్. గ్రామ వార్డ్ వాలంటరీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడియం జానీ. నాలుగు మండలాల మండల అధ్యక్షులు కార్యదర్శులు. మహేష్. రామ్ రెడ్డి. ప్రసాద్. దుర్గారావు. కుమార్. నాగరాజ్. జనార్దన్ రెడ్డి. పద్మావతి. శాంతి. కుమారి. లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు. (Story :వాలంటీర్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలి)

