పట్టణ ప్రజలు త్రాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి
న్యూస్ తెలుగు/ వినుకొండ : పట్టణంలో పబ్లిక్ త్రాగునీటి కుళాయిలపై శనివారం నాడు మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ దృష్టి పెట్టారు. పలు ప్రాంతాలలో కుళాయిల నీరు వృధాగా పోవడం కమిషనర్ చూసి ఆయా ప్రాంత ప్రజలను ప్రశ్నిస్తూ తమ సిబ్బందికి కూడా తగు సూచనలు చేశారు. త్రాగునీరు సరఫరా వేళలు తెలుపుతూ ప్రజలు త్రాగునీరు పట్టుకోగానే నీటి సరఫరా ఆపివేయాలని మున్సిపల్ అధికారులను సిబ్బందిని కోరారు. గతంలో త్రాగునీటి సమస్య ఉండేదని, నేడు ఏ ప్రాంతంలో కూడా త్రాగునీరు సరఫరా కొరత లేకుండా సరఫరా చేస్తున్నామని, అయితే త్రాగునీటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రజలు అశ్రద్ధ చూపుతున్నారని కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచి అయినా త్రాగునీరు సక్రమంగా అవసరానికి వాడుకోవాలన్నారు. (Story : పట్టణ ప్రజలు త్రాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి )