UA-35385725-1 UA-35385725-1

వినుకొండ వైసీపీ నాయకులకు కూటమి పార్టీల స్ట్రాంగ్ వార్నింగ్

వినుకొండ వైసీపీ నాయకులకు

కూటమి పార్టీల స్ట్రాంగ్ వార్నింగ్

న్యూస్ తెలుగు/వినుకొండ : ఐదేళ్లు రౌడీయిజం, హత్యలు, సెటిల్‌మెంట్‌లతో వినుకొండలో భయోత్పాతం సృష్టించిన వైకాపా నేతలు కూటమిప్రభుత్వంపై బురదజల్లుతున్నారని తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకులు మండిపడ్డారు. ఒళ్లు దగ్గరపెట్టుకోవడంతో పాటు వాళ్లు చేసిన అరాచకాలపై త్వరలోనే సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వినుకొండలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం వినుకొండలో జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి యార్లగడ్డ లెనిన్, జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ ఆయూబ్‌ఖాన్ వైసీపీ విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యార్లగడ్డ లెనిన్ మాట్లాడుతూ. వైసీపీ నాయకులు ముందుగా వాళ్ల సంగతేంటో వాళ్లు చూసుకోవాలి. వాళ్లు చేసిన దందాలు ఎన్నో.. పోలీస్‌ స్టేషన్లను సెటిల్‌మెంట్ కేంద్రాలుగా మార్చుకున్నారు. వాళ్లొచ్చి కూటమి నేతల్ని బెదిరించడమా? ఎవరి సంగతి ఎవరు తేల్చుతారు? మార్కాపురం రోడ్డులో లారీ పేరిట దందా చేసి దోచుకున్నది నిజం కాదా? వైసీపీ పాలనలో పల్నాడులో లెక్కలేనన్ని హత్యలు చేశారు. వినుకొండ నియోజకవర్గం రావులాపురంలో బీసీ వ్యక్తి జల్లయ్యను దారుణంగా హత్య చేశారు. మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్యను చంపేశారు. భాజపా నాయకుడు మేడం రమేష్‌పై దాడి చేసి చంపాలని చూశారు. ఆ కేసులో వైకాపా ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా సంబంధం ఉంది. అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. సీఐడీ దర్యాప్తు కూడా జరగబోతోంది. ఒక మాజీ ఎమ్మెల్యే పోలీస్‌స్టేషన్ నుంచి వీడియో కాల్ చేసి స్థలం విషయంలో బెదిరించడం కంటే దారుణం ఉంటుందా? లెక్కలేనన్నీ భూకబ్జాలు చేశారు. సర్వే నంబర్లు టాంపర్ చేశారు. మార్కాపురం రోడ్డులో కోట్ల విలువైన భూమి విషయంలో బెదిరించి కమీషన్లు తీసుకున్నారు. వాళ్లందరికీ కూడా టైమ్ దగ్గర పడుతోంది. అయిదేళ్ల వైకాపా పాలనలో జర్నలిస్టులను కూడా బెదిరించారు. నోరునొక్కారు. 2029 వరకు జమిలీ ఎన్నికలు వచ్చే ప్రసక్తి లేదు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ. జగన్‌ పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోలేని స్థితిలో వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. కూటమి నాయకులు పోలీస్‌స్టేషన్లలో దందాలు చేస్తున్నారన్న మాటను దమ్ము ఉంటే నిరూపించాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్‌స్టేషన్లలో 6 నెలల ఫుటేజీ తీసుకొస్తామని, ఆ పార్టీ నాయకులు కూడా 5 ఏళ్ల ఫుటేజీ తీసుకురావాలి. వైసీపీ వాళ్లలా అక్రమ కేసులు పెట్టడానికి వీల్లేదని, అందరిని సమానంగా చూద్దామనే ఎమ్మెల్యే జీవీ ఎప్పుడూ చెబుతు ంటారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తరఫున 5 వార్డులకు పోటీపడితే నాటి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఫోన్ చేసి ప్రాణాలు తీస్తామని బెదిరించి నామినేషన్లు ఉపసంహరణ చేసుకునేలా చేశారు. అది వైకాపా సంస్కృతి. వైసీపీ పాలనలో వినుకొండలో ఎక్కడ చూసినా గంజాయి, గుట్కా దొరికింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ పేరు వినిపించకుండా చేశారు. ఏనుగుపాలెంలో పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి ఎస్సై వెంకట్రావు ఎలా ప్రవర్తించారో మరిచిపోతే ఎలా? భయపెట్టి ఎన్నికలు చేశారు. నామినేషన్లు వేయకుండా బెదిరించి ఎన్నికలు చేసుకున్నా రు. వైసీపీని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విశ్వసించడం లేదని, కేవలం ఆ పార్టీ శ్రేణులను కాపాడుకోవడం కోసమో కూటమి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆయూబ్‌ ఖాన్ మాట్లాడుతూ.
జగన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది న్యాయవాదులు అనుచితమైన వ్యాఖ్యలు చేశారని, వాటిని కూటమి ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయూబ్‌ఖాన్ తెలిపారు. మాపై విమర్శలు చేసేముందు వైసీపీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకు దిగజారిందో కారణాలు తెలుసుకోవాలని, ప్రజల్లో నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. అది తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నప్పుడు విచ్చలవిడిగా గంజాయి రవాణా జరిగిందన్నారు. చదువుకునే పిల్లలు ఎంతోమంది గంజాయికి బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ భూఆక్రమణలు చేశారో వినుకొండ ప్రజంలదరికీ తెలుసన్నారు. వినుకొండలో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు జరగడానికి వీల్లేదని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. (Story : వినుకొండ వైసీపీ నాయకులకు కూటమి పార్టీల స్ట్రాంగ్ వార్నింగ్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1