ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి
న్యూస్తెలుగు/ వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఉదయం వనపర్తి లోని బసవన్నగడ్డ, వనపర్తి శివారు రాజానగరం వడ్డెగేరిలో జరుగుచున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో సర్వేయర్ రోజుకు కనీసం 25 ఇళ్ళు పూర్తి చేయాలని ఆన్లైన్ లో డేటా నింపేటప్పుడు తప్పులు చేయవద్దని సిబ్బందిని సూచించారు. సర్వే చేసేటప్పుడు కుటుంబ సభ్యుల వివరాలు ఏమైనా తప్పులు ఉంటే సరి చేయాలని చెప్పారు. యాప్ లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజనగరం శివారులోని అమ్మ చెరువు ను పరిశీలించారు. చెరువు కట్టపై ఏర్పాటుచేసిన లైట్లు వినియోగంలో ఉన్నాయా అని మునిసిపల్ కమీషనర్ ను అడిగి తెలుసుకున్నారు. కట్టపై క్లీనింగ్ చేయడంతో పాటు, ఉన్న ఖాళీ స్థలంలో ప్లాంటేషన్ చేయించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు..మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు. (story : ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి)