సిఐ దుర్గా ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దళిత సంఘం నేతలు
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు సిఐ దుర్గా ప్రసాద్ ని చింతూరు దళిత కుటుంబ సంక్షేమ సంఘం ముఖ్య నేతలు అధ్యక్షులు మెల్లం నాగేంద్ర, కార్యదర్శి ఇంటి సుదర్శన్ కుమార్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఇటీవల కాలంలో నూతనంగా ఎన్నికయిన యూనియన్ నాయకులు సిఐ వారిని కలిసి కమిటీ సభ్యులను పరిచయం చేయటం జరిగింది. అనంతరం సిఐ మాట్లాడుతూ మీరు చేసే మంచి కార్యక్రమం చాలా మంచిదని, మీకు మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు సిహెచ్ వేణు గోపాల్, గ్రామీణ వైద్యులు సాగర్, ఆనంద్,లాడే శ్రీనివాసరావు,డేవిడ్ నక్కా విజయరత్నం,నక్కా రజని కుమార్, చదలవాడ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.(Story : సిఐ దుర్గా ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దళిత సంఘం నేతలు)