లౌకిక వాదాన్ని కాపాడండి
భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి
బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : లౌకికవాదాన్ని కాపాడి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు అన్నారు మంగళవారం ఇటీవల లంకా పట్టణంలో ఉన్న చర్చి స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్న వారిని ఆపాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సోము రాంబాబు మాట్లాడుతూ లంకాపట్నం ప్రాంతంలో గత 20 సం॥లుగా కులమతాలకు అతీతంగా క్రైస్తవులు, హిందూవులు సహకారంతో చర్చి నడుపుతున్నారని, హదూద్ తుపాన్ కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హుదూద్ తుపాన్ బాధితులకు గృహ నిర్మాణంలు ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో అక్కడ వున్న చర్చిని వేరే దగ్గర ఏర్పాటు చేయాలని అప్పటి మున్సిపల్ అధికారులు ఇప్పుడు వున్న చర్చి స్థలాన్ని చూపించడం జరిగిందన్నారు. అప్పటి నుండి కులమతాలకు అతీతంగా హిందువులు, క్రైస్తవులు కూడా ప్రార్ధనలు చేస్తున్నారని. ఇటీవల కొంత మంది మనువాదశక్తులు ఆ స్థలం పై కన్నుపడి, కబ్జాకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటీవల విజయనగరం నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పడం అన్యాయం అన్నారు. అందువలన చర్చికి రక్షణ కల్పించి ముందు క్రైస్తవ మనోభవాలను దెబ్బతీయకుండా సమిష్టిగా వుండేటట్లు అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే సోములు , లంకా పట్నం వాసులు తదితరులు పాల్గొన్నారు. (Story : లౌకిక వాదాన్ని కాపాడండి)