సీతం కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : విజయనగరం పట్టణంలో గాజులరేగ పరిధిలోగల సీతం కళాశాలలో మంగళవారం డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆద్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్దినీ విద్యార్థుల తో రాజ్యాంగం యోక్క అవసరం , రాజ్యాంగం విధి విధానాలు , రాజ్యాంగ రచన వంటి అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. విద్యార్థులతో రాజ్యాంగం పై ఉపన్యాసాలు, వ్యాసరచనలు నిర్వహించారు.ఈ సందర్భంగా కళాసాల డైరెక్టర్ డా॥ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ రజ్యాంగ విధానాలను ప్రతి ఒక్కరు తెలుసుకుని సమాజం పట్ల భాద్యతగా ఉండాలని కోరారు.ఈ సందర్భంగా సీతం ప్రిన్సిపల్ డా ద్వివేదుల రామమూర్తి మాట్లాడుతూ నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం అవసరాన్ని వివరించారు. ఈ సందర్బంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మెనేజ్మెంట్ స్టడీస్ హెచ్.ఓ.డీ డా॥ యస్ వరూధిణీ మాట్లాడుతూ , మేనేజ్మెంట్ విద్యార్దులకు భారత రాజ్యాంగం అనే అంశాన్ని తమ పాఠ్యాంశంలో చేర్చారు అన్నారు ప్రతీ విద్యార్థికి రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉపాద్యాయులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సీతం కళాశాలలో“ భారత రాజ్యాంగ దినోత్సవం )