UA-35385725-1 UA-35385725-1

ఆంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది

ఆంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది

న్యూస్ తెలుగు/ సాలూరు : ఆంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రాథమిక సదుపాయాలు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శాసన మండల సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ప్రభుత్వం ప్రాథమిక సదుపాయాల కోసం ప్రారంభంగా 7,090 ఆంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక్కటికి రూ. 1 లక్ష చొప్పున రూ. 70 కోట్ల 90 లక్షల నిధులను విడుదల చేసిందని అన్నారు..
ఈ నిధులతో LED టీవీలు, ఆర్‌ఓ ప్లాంట్లు, బెంచీలు, కుర్చీలు, పిల్లలకు బొమ్మలు వంటి సదుపాయాలను అందించనున్నమని అన్నారు.
ఇవి ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు.. ఆంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్నామని సమాధానం ఇచ్చారు. (Story : ఆంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1