వీధి దీపాలకు మరమ్మత్తులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణంలో అన్ని వీధి దీపాలను వెలిగించి పట్టణాన్ని దేదీప్యమానంగా వెలిగేలా చేస్తామని ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పట్టణ పరిధిలోని అన్ని వీధి దీపాలను మరమ్మత్తు చేసి ప్రజలకు రాత్రి సమయంలో రోడ్లు, మార్గాలు మరియు బహిరంగ ప్రదేశాలకు వీధి దీపాల వెలుతురును అందించారు. ప్రజల భద్రత, మరియు దృశ్యమానతను నిర్ధారించడానికి వీధి దీపాల అవసరం అసమానమైనదని పునరుద్ఘాటిస్తూ శుక్రవారం రాత్రి 8:30 గంటలకు పట్టణంలోని వీధి దీపాలను తనిఖీ చేశారు. వీధి దీపాల పరిస్థితిని పనితీరుని పరిశీలించి కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ ఎలక్ట్రీషియన్ జానీ బాషాకు, వీధి లైట్ల మరమ్మతులు మరియు నిర్వహణను వేగవంతం చేయాలని, సమర్థవంతమైన మరియు విశ్వసనీయమైన పౌర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఆదేశించారు. పట్టణంలో మొత్తంగా 120W వీధి దీపాలు 5725 పనిచేస్తున్నవని అదనంగా 210W ఐమాక్స్ సెంట్రల్ లైటింగ్ నాలుగు ప్రధాన కూడళ్లలో రంగనాయక స్వామి ఆలయం వద్ద శివయ్య స్థూపం వద్ద బస్టాండ్ వద్ద రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో దుగ్గిరాల స్థూపం వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. పౌరులు కూడా వీధి లైట్స్ ని ఆకతాయుల బారినుండి నుండి కాపాడుకోవాలని బాధ్యతగా తెల్లవారగానే వాటిని ఆఫ్ చేసుకొని లైట్స్ మన్నికను కాపాడుకోవాలని కోరారు. (Story : వీధి దీపాలకు మరమ్మత్తులు )